- Advertisement -
బాధిత కుటుంబానికి బీజేపీ నేతలు ఆర్థిక సహాయం
BJP leaders provide financial assistance to the victim's family
జగిత్యాల
మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ధర్మపురి నియోజకవర్గ కో-కన్వీనర్ పంచిత లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బిజెపి నాయకులు కార్యకర్తలు విరాళాలుగా సేకరించిన 34,500 రూపాయల నగదును లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.మృతుడు లక్ష్మణ్ బీజేపీలో చేరిన అనతి కాలంలోనే గ్రామంలో చాలా మంది క్రియాశీల కార్యకర్తలను తయారుచేసి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామం నుండి బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చేవిదంగా కృషి చేశారని ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు,జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్, బుగ్గారం మండల ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, పంచిత ధర్మరాజు, రవీందర్ రెడ్డి, మల్లేష్, పృథ్వీరాజ్, విలాసాగరపు నందయ్య తదితరులు పాల్గొన్నారు…
- Advertisement -