పార్లమెంటు ఎన్నికలకు ఇన్చార్జిలను నియమించిన బిజెపి అధిష్టానం

- Advertisement -

పార్లమెంటు ఎన్నికలకు ఇన్చార్జిలను నియమించిన బిజెపి అధిష్టానం

హైదరాబాద్ జనవరి 08

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జులను నియమించింది.

ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదిలాబాద్‌కు పాయల్ శంకర్,

పెద్దపల్లి – రామారావు పటేల్,

కరీంనగర్‌ – ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా,

నిజామాబాద్‌ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి,

జహీరాబాద్‌ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి,

మెదక్‌ – హరీష్ బాబు,

మల్కాజ్‌గిరి – పైడి రాకేశ్ రెడ్డి,

సికింద్రాబాద్ – డాక్టర్‌ కే.లక్ష్మణ్‌,

హైదరాబాద్‌ – రాజాసింగ్,

చేవెళ్ల – వెంకట నారాయణ రెడ్డి,

మహబూబ్‌నగర్ – రామచందర్ రావు,

నాగర్‌కర్నూలు – రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రా రెడ్డి,

భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,

వరంగల్‌ – మర్రి శశిధర్ రెడ్డి,

మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు,

ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

కాగా, పార్టీ కీలక నేతలైనా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular