Monday, January 13, 2025

బీజేపీ వర్సెస్ టీడీపీ

- Advertisement -

బీజేపీ వర్సెస్ టీడీపీ

BJP vs TDP

అనంతపురం, జనవరి 4, (వాయిస్ టుడే)
జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత మధ్య మాటల యుద్దం సాగుతున్న విషయం తెల్సిందే. ఆ యుద్దం మాధవీలతపై కేసు నమోదు వరకు దారితీసింది. ఈ విషయం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడ స్పందించారు. మాధవీలతకు మద్దతు పలికిన మంత్రి సత్యకుమార్, జేసీకి ఒకదశలో వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉదయం నుండి జేసీ వర్సెస్ మాధవీలత గురించి మీడియా, సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే అదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇలా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇంత జరుగుతుంటే మాధవీలత మాత్రం బాగా నిద్రపోయారట. అదికూడ నిద్ర లేచి చూసేసరికి ఫోన్ నిండా మిస్డ్ కాల్స్ ఉన్నాయట. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వార మాధవీలత స్పందిస్తూ.. తనకు బాగా మైగ్రేన్ తలనొప్పి ఉందని, అందుకు బాగా నిద్రపోయానని ప్రకటించారు. అలాగే తన ఫోన్ కు ఎందరో మీడియా ప్రతినిధులు ఫోన్లు చేశారని, నిద్ర లేచి ఫోన్ చూసి ఖంగుతిన్నట్లు తెలిపారు. వాట్సప్ ఓపెన్ చేసినా కూడ, తన న్యూస్ లే తనకు కనిపిస్తున్నాయని ఇదెక్కడి రాద్దాంతమంటూ ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.తాడిపత్రిలో దివాకర్ ట్రావెల్స్ కుచెందిన బస్సులు తగలబడటం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్ 31వ తేదీన మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే బీజేపీ నేతలు విమర్శలు చేశారని.. అయినా తాను నిర్వహించానని అందుకే బస్సులు తగులబెట్టారన్నారు. ఈ క్రమంలో ఆయన బూతులు అందుకోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో డిసెంబర్ 31న వేడుకలు నిర్వహించారు. ఈ పార్కులో నిర్వహించే వేడుకలకు వెళ్లవద్దని మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు. అక్కడ మహిళలకు భద్రత లేదని ..  జేసీ పార్కు వద్ద గంజాయి, డ్రగ్స్‌ బ్యాచ్‌లు ఉంటాయని ఆరోపించారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో మత్తులో వాళ్లు ఏమైనా  చేయవచ్చని అన్నారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.   పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని అన్నారు.   మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాధవీలతపై తాడిపత్రిలో పోలీసు స్టేషన్‌లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయాలని కోరారు.  జనవరి 2వ తేదీన తెల్లవారిజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు తేల్చారు.  కానీ ఇది బీజేపీ నాయకుల పనే అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జగనే నయం అని.. జగన్‌ కేవలం తన బస్సులను సీజ్‌ చేయించారని.. కానీ మీరు మాత్రం బస్సులు తగలబెడుతున్నారంటూ బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని.. పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమిలో ఉంటూ ఇలా మాట్లాడటం తగదని బీజేపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ  బీజేపీపై జేసీ ప్రబాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని  మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదని విమర్శించారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జేసీ ఆయన వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్