రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది
కేంద్రమంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
యాదాద్రి
రాష్ట్రంలో బిజెపికి అనుకూలమైన పరిస్థితులున్నాయి. దేశంలో మేదావులు ,విద్యావంతులు బిజెపికి అండగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సమాయత్త సమావేశంలో అయన మాట్లాడారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు పార్టీ లో ఉండే పరిస్థితి లేదు. తెలంగాణ లో కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయoగా బిజెపి ఎదుగుతుంది. గెలిచిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని కేసీఆర్ ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. తెలంగాణలో బిజెపి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన బిజెపి పోరాడుతుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ పట్టభద్రులు బిజెపి వైపే ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -