బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బిజెపి పూర్తి మద్దతు
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిసి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు
* బిసిలకు 42 శాతం బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదు
* ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆగ్రహం
హైదరాబాద్ ఆగష్టు 4
BJP's full support for implementation of 42 percent reservation for BCs: BJP state president Ramachandra Rao
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిసి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలకు 42 శాతం బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం ఇస్తామని చెప్పలేదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో చేసినట్లే ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బిసిలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బిజెపి పూర్తి మద్దతిస్తుందని తెలియజేశారు. ముస్లింలకు 10 శాతం ఇస్తే, పదిశాతం బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. బిజెపి అడ్డుకుంటోందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ను బిసిలు నమ్మరని అన్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదని, స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పాత రిజర్వేషన్లే కొనసాగించాలనేది ఉద్దేశం అని రామచందర్ రావు పేర్కొన్నారు.


