1970 తర్వాత రాజ్యసభలో బీజేపీ మెజార్టీ

- Advertisement -

1970 తర్వాత రాజ్యసభలో బీజేపీ మెజార్టీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27, ( వాయిస్ టుడే)

BJP’s majority in Rajya Sabha after 1970
దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 50 ఏళ్ల వరకు దేశాన్ని కాంగ్రెస్‌ పాలించింది. దీంతో ఆ పార్టీకి లోక్‌సభలో, రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఉండేది అందుకే రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించింది. అయితే

1970 తర్వాత రాజ్యసభలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత లోక్‌సభలో, రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా బీజేపీ కొట్టిన దెబ్బకు

రెండు పిట్టలు పడ్డాయి. ఒకటి ఆప్‌ పార్టీ దెబ్బతినగా, మరోవైపు బీజేపీ రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ దిశగా కదులుతుంది. ఇది 2029 ఎన్నికలకు ముందస్తు రాజకీయ మలుపుగా

మారింది.పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌కు రాజ్యసభలో పది మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఎంపీలు రెండు రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా వారు బీజేపీలో చేరారు. పార్టీ

వ్యవస్థాపకులైన రాఘవ్‌ చద్దా నేతృత్వంలో జరిగింది. చద్దా ఉపనేత పదవి నుంచి తొలగించబడిన తర్వాత రాజీనామా చేసి, మరో ఆరుగురిని కూడా తీసుకెళ్లాడు. ఇది పార్టీ ఫిరాయింపు కాదని పూర్తి

విలీనం’ అని ప్రకటించారు. ఇప్పుడు ఆప్‌కు ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇందులో ఇద్దరు పంజాబీలురాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉన్నాయి. 123 సీట్లు ఉంటే సంపూర్ణ మెజారిటీ

ఉన్నట్లు బీజేపీకి నవంబర్‌ నాటికి 113 సీట్లు వస్తాయి. తాజాగా బీజేపీలో చేరిన ఆప్‌ ఎంపీలు కలుపుకుంటే బీజేపీ బలం 120కి చేరుతుంది. మెజారిటీకి మూడు సీట్లు అవసరం ఉంటుంది. మిత్రపక్షాలతో

కలిపి 155 సీట్లు బీజేపీకి ఉంటాయి. విపక్షాలు కేవలం 90 సీట్లకు పరిమితం అవుతాయి. 1970 తర్వాత సొంత బలంతో మెజారిటీ సాధించే ఏకైక పార్టీగా బీజేపీ నిలుస్తుంది.పంజాబ్‌లో 2027

అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కు తాజా పరిణామం పెద్ద దెబ్బ. ఎంపీల విలీనం పార్టీ ఐక్యతను దెబ్బతీసింది. బీజేపీకి లోక్‌సభలో 240 సీట్లతో మెజారిటీ ఉంచుకుంటూ, రాజ్యసభలో కూడా ఆధిపత్యం

సాధిస్తోంది. ఇది సంపూర్ణ కూర్పు, మార్పులు, చేర్పుల ద్వారా 2029కు మార్గం సుగమం చేస్తుంది. ఆప్‌లో అసంతృప్తి, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు కీలక కారణాలు.బీజేపీ రాజ్యసభ మెజారిటీతో కీలక

బిల్లులు సులభంగా ఆమోదం పొందుతాయి. ఆప్‌ పంజాబ్‌లో బలహీనపడుతుంది. ఇది జాతీయ రాజకీయాల్లో బీజేపీ డామినెన్స్‌ను బలోపేతం చేస్తుంది. ప్రతిపక్షాలకు కొత్త సవాల్‌గా మారుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular