Sunday, September 8, 2024

భలే…భలే… సెకండ్ లీడర్లకు మంచి డిమాండ్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 19, (వాయిస్ టుడే):  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున వేళ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం మొదలు పెట్టేశారు. ఓటర్లకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి. హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తే, బీఆర్ఎస్ దాన్ని మించి మేనిఫెస్టోను ప్రకటించింది. కాంగ్రెస్ 5వందలకే గ్యాస్ సిలిండర్ అంటే బీఆర్ఎస్ 4 వందలకే సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ఇలా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో అధికార నుంచి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు రేపో ఎల్లుండో ఖరారు చేయనుంది. బీజేపీ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఆ పార్టీలో ఇంత వరకు ఉలుకు పలుకు లేదు. పార్టీ టికెట్‌ తమకే వస్తుందనే ధీమాతో కొందరు ఆశావహులు, ఇప్పటికే టికెట్ దక్కించుకున్న అధికార పార్టీ నేతలు ప్రత్యర్థుల బలబలాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మండలాలు, గ్రామాల వారీగా ఆయా పార్టీల్లో బలమైన నాయకులు ఎవరు..? వారి బలహీనతలు ఏమిటి..? వారు పార్టీ ఫిరాయిస్తే గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే అంశాలపై బేరీజు వేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలతో బేరసారాలకు దిగుతున్నారు. గ్రామ, మండలస్థాయి నేతలకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నజరానాలు వెనుకాడటం లేదు. కొంచెం పలుకుబడి, ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు పది నుంచి 20లక్షలు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. నగదుతో పార్టీల్లోకి వచ్చిన తర్వాత పదవులు కట్టబెడతామని హామీలు ఇస్తున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని రాజకీయపార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడ్డా తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశంతో ఉన్న వారిపై కాంగ్రెస్‌ పార్టీ కన్నేసినట్లు సమాచారం. ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి వారి సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ద్వితీయశ్రేణి నేతలు అడిగినవన్నీ చేసేందుకు వెనుకాడటం లేదు.తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు తమ నుంచి జారిపోకుండా ఆయా పార్టీల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. వారిని మచ్చిక చేసుకుని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పిస్తామని, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో కొనసాగే విధంగా ఆయా పార్టీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ బలం పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రచారాలు, హామీలు ఎలా ఉన్నా ప్రజలను పోలింగ్ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓటు వేయించేది మాత్రం ఈ సెకండ్‌ లెవల్‌ నేతలే. ఎలక్షనీరింగ్‌లో వీరిది కీలక పాత్ర అందుకే వారిని కలుపుకొని వెళ్లాలని ఈ మధ్య పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.  వారిని మచ్చిక చేసుకోవాలన్నారు. కొందరు అలుగుతారని అలాంటి వారితో మాట్లాడి ప్రచారం చేయించాలన్నారు. ఈగోకు పోతే అసలుకే మోసం అవుతుందని హెచ్చిరంచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్