బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి
బలుసులమ్మకు ఆషాడం సారె సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం
Blessings of Goddess Balusulamma should be received by all
బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర మొత్తం సుభిక్షంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం గ్రామదేత బలుసులమ్మ అమ్మవారికిశనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆషాడం సారే అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో అమ్మవారికి జాతర చేసిన సందర్భంలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉండడం అదృష్టమని అదే మాదిరిగా తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వచ్చే సంవత్సరం జాతర చేయాలని నిర్ణయించామన్నారు. పట్టణ ప్రజలు కూడా వచ్చే ఏడాది జాతర చేసేందుకు సమయత్వం కావాలని పెళ్లిళ్లు వంటి శుభ కార్యక్రమాలకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. ముందుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సతీమణి అనురాధ, కుమారుడు బొలిశెట్టి రాజేష్ కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులనుఅభినందించారు.