ఢిల్లీకి దారి బంద్.. రేపు రైతన్నల ‘ఢిల్లీ చలో’ మార్చ్
డిమాండ్ల సాధన కోసం
పాల్గొననున్న 200కుపైగా రైతు సంఘాలు
ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు
హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు
144 సెక్షన్.. ఇంటర్నెట్‌పై నిషేధం విధింపు
న్యూఢిల్లీ/చండీగఢ్, ఫిబ్రవరి 11: అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలను మోహరించారు. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. హర్యానా-ఢిల్లీ, యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఆదివారం పరిశీలించారు. రాజధానిలోకి ప్రవేశించే రోడ్లను బ్లాక్ చేసేందుకు పెద్ద కంటెయినర్లను తరలిస్తున్నారు. బస్సు, రైలు లేదా ఏ ఇత