- Advertisement -
పడవల రాకపోకలు బంద్
Boat services suspended
ప్రయాణికులకు ఇక్కట్లు
నర్సాపురం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ట గోదావరికి వరద తాకటంతో గోదావరిలో పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు . దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నర్సాపురం నుంచి కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు, పడవలపై పదివేల మంది పైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో అధికారులు రేవులను మూసి వేశారు. దీంతో ప్రయాణికులు చించినాడు వంతెన మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- Advertisement -