వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 26న వేములవాడ లో జరగనున్న బహిరంగ సభ సభాస్థలిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు.వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు భారీ మెజారిటీతోగెలిపించుకోవాలని ఓటర్లను కోరేందుకు కెసిఆర్ ఈనెల 26న వేములవాడలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.వేములవాడ పట్టణంలోని కోర్టు ప్రాంతంలోని బాల నగర్ లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థలాన్ని వినోద్ కుమార్ పరిశీలించారు.సభా ప్రాంగణం తో పాటు హెలిప్యాడ్ను పార్కింగ్ స్థలాలను వినోద్ కుమార్ పరిశీలించారు. వేములవాడ నియోజకవర్గం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో వినోద్ కుమార్ చర్చించారు.వారి వెంట బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, రాజు, కౌన్సిలర్లు విజయ్, మారం కుమార్, యాచమనేని శ్రీనివాసరావు, రాము, తిరుపతి, జోగిన్ పల్లి అజిత్ రావు, దూలం సంపత్ గౌడ్ తదితరులు ఉన్నారు.