- Advertisement -
ఆకట్టుకుంటున్న చిరంజీవి కటౌట్
సూర్యాపేట: కొన్ని కొన్ని కటౌట్ లను చూసి నమ్మేయాలి డ్యూట్ అంటున్నారు సూర్యాపేట జిల్లాలోని చిరంజీవి అభిమానులు. “బోళా శంకర్” మూవీ రిలీజ్ సందర్భంగా.. హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవే పక్కన “మెగాస్టార్ చిరంజీవి” భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి పై తమ కున్న ప్రేమ,అనురాగాన్ని తాము ఈ కటౌట్ ద్వారా తెలియజేసామని అభిమానులు ఫీలవుతున్నారు. దీంతో.. హైదారాబాద్ – విజయవాడ హైవేపై.. మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
- Advertisement -