13.2 C
New York
Thursday, February 29, 2024

బాంబు కలకలం

- Advertisement -

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నాటు బాంబు కలకలం రేపింది. నాటుబాంబు లభ్యం కావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముద్దునూరు రోడ్డు పెన్నానది సమీపంలో గల ప్లాట్లల్లో బాంబు ఉందనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున నాటు బాంబులు దొరికినట్లు చెబుతున్నారు. ఇవాళ కూడా మరొక నాటు బాంబు ఇదే ప్రాంతంలో లభించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలపై తనిఖీలు చేస్తున్నారు.

Bomb blast
Bomb blast

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!