Wednesday, May 6, 2026

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకం

- Advertisement -

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకం

కరీంనగర్, మే 6: వాయిస్ టుడే

Bomma Sriram Chakravarthy Appointed as Chairman of Munnuru Kapu Corporation

రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్‌లకు చైర్మన్లు, వైస్ చైర్మన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఏపీ హౌస్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించింది. ఈ నిర్ణయంపై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, మున్నూరు కాపు సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేశాయి. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తండ్రి, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ, సామాజిక రంగాల్లో సేవలందిస్తున్నారు. ఆయన ఏపీ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా (2006–2009), ఏపీసీసీ జనరల్ సెక్రటరీగా, ఏపీ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా (2002–2007), హౌస్‌ఫెడ్ డైరెక్టర్‌గా (2001–2006) కీలక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్‌లో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం చైర్మన్‌గా, మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఏపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. టీపీసీసీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమంలో 37 వేల మందికి పైగా సభ్యులను చేర్పించడం ద్వారా క్రియాశీల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన విద్యార్హతలు B.E., LL.B కాగా, ప్రస్తుతం వయస్సు 53 సంవత్సరాలు. సామాజిక న్యాయం, బీసీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నియామకం చేపట్టడం శుభపరిణామమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వంలో మున్నూరు కాపు వర్గానికి విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్