ఇద్దరికి తగిన అర్హతలు లేవు…

- Advertisement -

తెలంగాణ గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, సెప్టెంబర్ 25, (వాయిస్ టుడే): తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు.  గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.  ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ.. అభ్యర్థిత్వాలను రిజెక్ట్ చేశారు. ఆర్టికల్‌ 171 (5)- ప్రకారం ఈ అభ్యర్థులకు తగిన అర్హత లేదన్నారు. ఈ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం తన వద్దకు రాలేదని తెలిపారు. కుర్రా సత్యనారాయణ రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారని.. సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని తమిళిసై పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నా.. వారిని పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని.. అలా చేయడం ఆర్టికల్‌ 171 (5)కి విరుద్దం అని ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు సూచించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ రంగంలోనూ దాసోజు శ్రవణ్ అచివ్‌మెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తులను కేబినెట్ సిఫార్సు చేస్తే నియమిస్తానని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular