- Advertisement -
తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం.
Breast milk is the perfect health for the baby.
పోషణ మాసం సందర్భంగా గృహ సందర్శనలు
జగిత్యాల సిడిపిఓ మమత
జగిత్యాల,
తల్లిపాల ద్వారానే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జగిత్యాల సిడిపిఓ మమత అన్నారు.
పోషణ మాసం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, గాంధీనగర్, అమీనాబాద్ అంగన్వాడి కేంద్రాల పరిధిలో సిడిపిఓ మమత ఆధ్వర్యంలో గురువారం గృహ సందర్శనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్యామ్ మరియు మ్యామ్ (తక్కువ బరువు) గర్భవతులు, బాలింతలు,పిల్లల ఇంటింటికి వెళ్లి గర్భవతులు తీసుకోవలసిన ఆహారము, ఆరోగ్యము, ముర్రు పాల ప్రాముఖ్యత, ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ, ప్రతి రోజు ఆహారంలో తీసుకోవాల్సిన ఆకుకూరలు, కూరగాయల గురించి సిడిపిఓ వివరించారు. బాలింతలు తమ బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లి తన ఆహారంలో రోజు పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని వివరించారు. తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డకు అనుబంధం ఏర్పడుతుందని, పిల్లలు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని, తల్లికి వచ్చే రొమ్ము క్యాన్సర్ నుండి నివారించ వచ్చని తెలిపారు.అదేవిదంగా బిడ్డకు బిడ్డకు ఎడం ఏర్పడుతుందని, తల్లిపాలలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. శ్యామ్ మామ్ పిల్లల ఇండ్లను సందర్శించి వారికి బిడ్డ యొక్క పెరుగుదల గ్రోత్ కార్డ్స్ ద్వారా వివరించారు. అంగన్వాడి కేంద్రాల్లో అందించే బాలామృతం ప్లస్సు తప్పనిసరిగా పిల్లలకు తినిపించడంతోపాటు ఇంటిలోని ఆహారం కూడా ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాధ, ఆశా వర్కర్ సునీత, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి, హరిప్రియ, గర్భవతులు బాలింతలు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -