ఉనికి కోసమే బీఆర్ఎస్, బీజేపీ ఆరాటం
కరీంనగర్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని, ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలు మాకు ఎన్నిరోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామని కరీంనగర్ లో తెలిపారు. ఉనికి కోసమే బిఆర్ఎస్ బిజేపి ఆరాట పడుతున్నాయని విమర్శించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ సాధిస్తుందని కరీంనగర్ లో స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కి వెళ్తు కరీంనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. మీడియాతో శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుంన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల ఐటి టవర్లతో పాటు మూడంచెల విధానంలో జిల్లా స్థాయి తర్వాత ఉన్న పెద్ద పట్టణాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగిస్తాం…దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై బిఆర్ఎస్ వ్యాఖ్యలు అర్థరహితన్నారు. అలాగని ఆ పని మేమే చేశామని బిఆర్ఎస్ చెప్పుకుంటే అవివేకంగా ఉంటుందన్నారు.
ఉనికి కోసమే బీఆర్ఎస్, బీజేపీ ఆరాటం
- Advertisement -
- Advertisement -