ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్న నేతలు
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్
మల్కాజ్ గిరి: గౌతమ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ప్రచార జోరు ఊపందుకుంది. స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కు ఆకర్షితులై బ్రహ్మరథం పడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరియు మరి రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా మంగళ హారతులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సర్కిల్ ఎన్నికల ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి నేతృత్వంలో హిల్ టాప్ కాలనీ ఇందిరా నెహ్రూ నగర్ జ్యోతి నగర్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి కి మరి రాజశేఖర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్, సిద్ధి రాములు, బైరు అనిల్, కాటం రాజు, నరహరి, రామచర్ల నర్సింగ్, బాచు, నగేష్ గౌడ్, శ్రీనివాస్, అనిత, ప్రదీప్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు