గజ్వెల్: సిఎం సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ బి.ఆర్.ఎస్. పార్టీ లో అసమ్మతి నాయకుల సమావేశం కలకలం రేపుతోంది. పార్టీ కి చెందిన ముఖ్య నేతలు సుమారు వందకు పైగా గజ్వేల్ పట్టణం లో సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. నియోజకవర్గం లోని మాజీ జెడ్.పి.టిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు వివిధ నాయకులు పాల్గొని బిఆర్ ఎస్ పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను బాహాటంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను, మంత్రి హరీష్ రావులని కలిసేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినా లాభం లేదని, గత ప్రభుత్వాలలో నాయకులకు విలువలు ఉండేవని, బిఆర్ ఎస్ ప్రభుత్వం లో నాయకులను అణిచివేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. గజ్వేల్ లో టి.ఆర్.ఎస్ పార్టీ కి పునాదులు వేసి పార్టీ అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా శ్రమించామని, కానీ అడుగడుగునా తమకు అవమానాలే ఎదురు అయ్యాయన్నారు.




