Monday, October 14, 2024

90 సీట్లతో మళ్ళీ బిఆర్ఎస్ జెండా …!

- Advertisement -
  • ఉమ్మడి జిల్లాలోని 13 సీట్లకు 13 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తాం
  • త్వరలోనే బిఆర్ఎస్ లోకి ఎవరూ ఉహించని విధంగా చేరికలుంటాయి
  • నన్ను తిట్టి వాళ్ళ పార్టీలో ఉనికిని చాటుకునేందుకు కొంతమంది యత్నిస్తున్నారు.
  • అలాంటి పిచ్చోళ్ళు చేసే విమర్శలకు స్పందించను
  • మా ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరడిగినా తక్షణమే రోడ్డు మంజూరు చేస్తాం
  • తీగల వంతెనపై స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా… 15 సాయంత్రం  ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
  • ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేక  గృహలక్ష్మి… బీసీ బంధుపై రాజకీయం చేస్తున్నాయి
  • గృహలక్ష్మి, బీసీ బంధు స్కీంలు నిరంతర ప్రక్రియ
  • అధికారమిస్తే దోచుకునేందుకు కొంతమంది కాపు కాస్తున్నారు
  • అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • వక్ఫ్ బోర్డు భూములంటూ ప్రతి ఎన్నికల సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్నారు
  • నేను ఎమ్మెల్యే కాకముందు 2008లో ఈ భూములు కొనుక్కున్నాను
  • రికార్డులు సరిగ్గా ఉన్నాయని చూసుకున్న తర్వాతే కొనుగోలు చేశాను
  • మంత్రి గంగుల కమలాకర్
BRS flag again with 90 seats
BRS flag again with 90 seats

తెలంగాణ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకుని… బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బిసి సంక్షేమ. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అన్నారు.. నేడు ఆదివారం మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేలీయ సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 సీట్లకు… 13 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు… మా ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరడిగిన తక్షణమే మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం 25 కోట్ల నిధులను బఫర్ కింద పెట్టుకున్నామన్నారు. మరో 125 కోట్లతో నగరంలోని మిగిలిపోయిన మేయిన్ రోడ్లన్నీ నిర్మూస్తున్నామని అన్నారు.. ప్రతిపక్షాలకు ఏ సబ్జక్టు లేక  గృహలక్ష్మి లాంటి స్కీంలను, బీసీ బంధుపై రాజకీయం చేస్తున్నాయని… అన్నారు..గృహలక్ష్మి, బీసీ బంధు స్కీంలు నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు…రాజకీయ అనుభవం లేని  కొంతమంది అజ్ఞానులు చేసే విమర్శలకు నేను స్పందించనని అన్నారు….. ఎన్నికల ముందు వచ్చి పిచ్చిమాటలు మాట్లాడేవాళ్లంతా.. ఎన్నికలయ్యాక మళ్లీ కనుమరుగవుతారని అన్నారు… ఇలాంటివారిపట్ల కరీంనగర్ ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఉండాలని పిలుపునిచ్చారు. నమ్మి అధికారమిస్తే దోచుకునేందుకు కాచుకుర్చున్నారన్న మంత్రి… సిఎం కెసిఆర్ పాలనలో… ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సురక్షితంగా ఉన్న నగరంలో అశాంతి కోసం ప్రయత్నిస్తోన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని… కొందరు నన్ను తిట్టి… వాళ్ల పార్టీలో పాపులారిటీ పొందాలని భావిస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డు భూముల పై ప్రతి ఎన్నికల సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్నారని… నేను ఎమ్మెల్యే కాకముందు 2008లోనే అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతే భూములు కొనుగోలు చేశానన్నారు.  త్వరలోనే ఎవరూ ఉహించని విధంగా… బిఆర్ఎస్ లో చేరికలుంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్