Wednesday, April 15, 2026

రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మంత్రి గంగుల

- Advertisement -

కరీంనగర్:  కొత్తపల్లి లోని కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ పాల్గోని మాట్లాడారు. రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో..ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న కొత్తపల్లి ని అభివృద్ధి చేయాలని ఎవరికి మనసు రాలేదు..నేడు కొత్తపల్లి ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేశాం. ఆనాటి నుండి ఈ రోజు వరకు పదవులు ఎన్ని వచ్చినా మీ మధ్యే ఉన్నా. నేడు కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం అయింది…మండుటెండల్లో మత్తల్లు దుంకే పరిస్థితి వచ్చింది. భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయి. ఆనాడు 1956లో చేసిన తప్పు తో తెలంగాణ ను ఆంధ్రలో బలవంతంగా కలిపితే మన వనరులు దోచుకున్నారు. ఆ పరిస్థితి తో తెలంగాణ దోపిడీకి గురై..దరిద్రాన్ని అనుభవించాం. మళ్ళీ నేడు ఒక్క ఓటు తప్పు చేస్తే తెలంగాణ 50 ఏళ్ల వెనక్కి వెళ్లడంతో పాటు మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఆంధ్ర నాయకులు బీజేపీ కాంగ్రెస్ రూపంలో మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో మకాం వేశారు..ఎక్కడ చిన్న అవకాశం దొరికినా తెలంగాణ ను మళ్ళీ ఆంధ్రలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సంపద దోచుకెళ్లాలని చూస్తున్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనకే కర్ణాటక లో ప్రజలు అల్లాడుతున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.
తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతిలో పెట్టకండి..ఢిల్లీలో బీజేపీ కష్టపడితే 5 సంవత్సరాలు మీ కోసం కష్టపడతా.
నాపై పోటీ చేసిన నాయకులు ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించిన పరిస్థితి లేదు..నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నా. ఆలోచించండి.రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. భూకబ్జా దారులకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తున్నారు. ఎంపీగా గెలిపిస్తే ఒక్క రూపాయి నిధులు తేలేని పరిస్థితి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 25 కుల సంఘాలు గంగుల కమలాకర్ కి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీలోద్దిన్, నాయకులు వాసాల రమేష్ తో పాటు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్