బీఆర్ఎస్ ఒక సచ్చిన పాము
బీజేపీ నేత లక్ష్మణ్
హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణ లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కు మార్గం సుగమం అవుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణా లో బీజేపీ పాగా వేయడం ఖాయం. ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో అయినా లేదా వారంతట వారు ప్రభుత్వం ను పడగొట్టుకుంటారు. దానికి బాధ్యులు వారే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. ఆరు గ్యారెంటీ లు అమలు చేయకపోతే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని అన్నారు.
తెలంగాణా లో టీఆర్ఎస్ ఒక చచ్చిన పాము. బీఆర్ఎస్ చీలికలు పేలికలుగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ నే బీఆర్ఎస్ కు బలం చేకూర్చే కుట్రలు చేస్తుంది. దేశం లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతోంది , ప్రజలు చీదరించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద విశ్వాసం ఉంటే రాహుల్ ను ప్రధాని గా ప్రకటించండి. నరేంద్ర మోడీ కి సరితూగే వ్యక్తి విపక్షాల కూటమిలో లేడు. చిన్న అవినీతి మెచ్చుకోలేకుండా మోదీ పాలన సాగిస్తున్నాడు. ఆరు గ్యారెంటీ లు పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభావం తప్పదని అన్నారు.
బీఆర్ఎస్ ఒక సచ్చిన పాము
- Advertisement -
- Advertisement -



