- Advertisement -
బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ..
BRS is an outdated party..
*ఆ పార్టీతో చర్చలే లేవు: బండి సంజయ్*
హైదరాబాద్:
కేటీఆర్ ను జైలులో వేయకపోతే యుద్ధమే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ అని..విలీనం చర్చలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ.. అ పార్టీ తో చర్చలే లేవు ..అంతా ఫేక్.. అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడానికి.. సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా..అంటూ ప్రశ్నించారు. మేము బెయిల్ ఇస్తే..సుప్రీం కోర్టు, హైకోర్టు లు ఎందుకు మరి అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి అంటే నాకు గౌరవం..ఎప్పటికైనా కేటీఆర్ ని జైల్ లో వేస్తారు అనుకుంటున్నానని బాంబ్ పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ రెడ్డి నా లాగే పోరాటం చేశారు..కేటిఆర్ ని జైల్ లో వేయకపోతే యుద్ధమే అంటూ వ్యాఖ్యానించారు. పది ఏళ్లు బీఆర్ఎస్… నిజామ్లా పాలించిందని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో బిఆర్ఎస్ వాళ్లు…. ఆరు గ్యారంటీలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
- Advertisement -