Wednesday, September 18, 2024

రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా బీఆర్ఎస్ చేస్తోంది

- Advertisement -

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

BRS is making the farmers go around the courts
BRS is making the farmers go around the courts

నల్గోండ, ఆగస్టు 18:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూ.. నకిరేకల్ పట్టణంలో ఆగి సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూలమాలవేసి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని మండిపడ్డారు. గ్రామకంఠం భూములతో‌ సహా దళితులకు ఇచ్చిన భూముల్ని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపణలు చేశారు. లిక్కర్ షాపులను ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో నిత్యం బెల్టు షాపులు అందుబాటులో ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబ పాలనను తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమేనని తేల్చి చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటి డీఎన్ఏ ఒకటేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ పార్టీ వారి‌ పంచెన చేరి దోపిడి చేస్తోందని ఆరోపించారు. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణ.. ఈరోజు కల్వకుంట్ల చేతిలో బంధీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.

నిజమైన చరిత్ర కారులకు న్యాయం

BRS is making the farmers go around the courts
BRS is making the farmers go around the courts

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నిజమైన చరిత్రకారుల్ని వెలుగులోకి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి అని అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయం కోసం సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. దొరలు, జమీన్‌దారులు, మొగలాయిలను ఓడించిన ధీరుడు పాపన్న అని కొనియాడారు. వృత్తిని అవహేళన చేసిన, అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేశారన్నారు.

బహుజన ఆత్మీయులతో చిన్నపాటి సైన్యంతో దోపిడీ పాలన అంతం చేసిన గొప్ప చరిత్రకారుడు పాపన్న అని లక్ష్మణ్ ప్రశంసించారు. మొగలాయి సైన్యంను ఓడించి.. భువనగిరి, ఓరుగల్లు, గోల్కొండ స్వాధీనం చేసుకున్న వీరుడు పాపన్న అని చెప్పారు. కుతుబ్ షాహీ, మొఘల్, నిజాం వలస పాలనను ఓడించిన వీరుడని.. అలాంటి చరిత్రను పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ బహుజన బిడ్డల చరిత్ర కనుమరుగు చేశారన్నారు. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వాళ్ల చరిత్ర కూడా చెరిపేశారన్నారు. బిర్సా ముండా, అల్లూరి లాంటి జాతీయ హీరోలను మోడీ ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేకుండా.. ఆ నలుగురికీ మాత్రమే గుర్తింపు ఇచ్చారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఆ నలుగురికి పరిమితమైన చరిత్రను.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలని కోరారు.బీజేపీ అధికారంలోకి వస్తే.. తాము చరిత్ర కారులను వెలుగులోకి తీసుకొస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా మోగులయ్య గౌడ్‌ను గుర్తు చేసుకున్నామన్నారు. కుల వృతుల వారికి సాయంగా ప్రధాని మోడీ విశ్వకర్మ యోజన చేశారన్నారు. శిక్షణ, ఉచిత పరికరాలతో పాటు వారికి లోన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారన్నారు. 13వేల కోట్ల రూపాయలతో 30 లక్షల కుటుంబాలకు మోడీ ఊతమిస్తున్నారని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్