Tuesday, March 18, 2025

 19న బీఆర్ఎస్ కీలక భేటీ

- Advertisement -

 19న బీఆర్ఎస్ కీలక భేటీ
మెదక్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)

BRS key meeting on 19th

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాత ఫామ్ హౌస్‌కు ఆయన పరిమిత మయ్యారు. ఎవరైనా నేతలు, కార్యకర్తలు వస్తే వారితో కాసేపు ముచ్చటిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా పార్టీ ఆఫీసుకు సైతం దూరమైన సందర్భాలు లేకపోలేదు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడంతో కేసీఆర్ పనైపోయిందనే చర్చ జరుగుతోంది. కనీసం అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాలని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్పినప్పటికీ బయటకు రాలేదు.ఫిబ్రవరి 19 నాటికి బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ఆ పార్టీ. ఈ క్రమంలో అదే రోజు మాజీ సీఎం కేసీఆర్ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికితోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. రేవంత్ సర్కార్‌కు ఏడాది సమయం ఇవ్వాలని భావించారు కేసీఆర్. అన్నట్టుగానే ఆయన ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి అయ్యింది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత కారు పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నాయి. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. న్యాయస్థానం తీర్పు వచ్చేలోపు బీఆర్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి.ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. ఫిబ్రవరి 19న పార్టీ సమావేశం వల్ల కొత్త పిక్చర్ వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఆ రోజు సమావేశానికి రాని నేతలు మిగతా పార్టీలకు వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. కచ్చితంగా కీలక నేతలంతా 19న మీటింగ్ కు వస్తారని అంటున్నారు. వచ్చే నేతలెవరు? రాకుండా ఉండేదెవరు? తెలుసుకునేందుకు హైకమాండ్ ఈ స్కెచ్ వేసిందని అంటున్నారు.నేతల భేటీలో ఎవరికి ఏయే విభాగాలను అప్పగించాలనే దానిపై ఓ క్లారిటీ రావచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ నేరుగా బయటకు రాకపోయినా, పార్టీని నడిపించేందుకు సలహాలు, సూచనలు ఇస్తారన్నది కొందరి మాట.   తొలుత స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి సెకండ్ వీక్ లో ఉంటుందని ఆ పార్టీ భావించింది. ఏప్రిల్ తర్వాత అని చెప్పడంతో సభలను సైతం వాయిదా వేయాలని భావిస్తోంది. పై అంశాలపై బుధవారం జరగనున్న పార్టీ సమావేశంలో ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్