ప్రజా సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల వినతి
BRS leaders request to solve public problems
కమాన్ పూర్
కమాన్ పూర్ మండల కేంద్రంలోని పిలిపలకు వెళ్లేదారిలో నూతలగుంట వద్ద గతంలో నిర్మించిన స్మశాన వాటిక నిరుపయోగంగా మారిందని దీనిని వినియోగంలోకి తీసుక వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సోమవారం ఎంపివో భాస్కర్ కు మండల బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడ పందుల నివాస కేంద్రంగా తయారై తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతుందని పేర్కొన్నారు. ఆ స్మశాన వాటిక అసంపూర్తితో ఉన్న కారణం చేత ప్రజలకు ఉపయోగంలోకి రాకపోవడం వలన అది చెత్తాచెదారంతో మారిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో జంతు కళాభారాలను వేయడం వలన ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వెంటనే తగు చర్యలను చేపట్టి అక్కడ చెత్తను తొలిగించి పరిశుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ధోబిఘాట్ నిర్మాణం జరిగిన ఉపయోగలోకి లేకపోవడం వలన నిరుపయోగంగా తయారైందని దానిని కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. నూతలకుంట మంచినీటి సరస్సుగా నైనా కావాల్సిన ఏర్పాట్లను దాని నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపెట్టాల్సిందిగా,
వైకుంఠధామం పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల రూపకల్పన వెంటనే చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, మండల యూత్ అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, బీఆర్ఎస్ నాయకులు తోట రాజ్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.