- Advertisement -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు
BRS MLAs arrested
మండిపడ్డ హరీష్ రావు
హైదరాబాద్
శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు. అలాయ్ బలాయ్ చేసుకుంటడు. ఆదానీతో వేలకోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటడు. ఇదెక్కడి న్యాయమని అన్నారు.వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదానీతో చీకటి ఒప్పందం బయటపడిందని, మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నరు. మిమ్మల్ని సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డని ప్రశ్నించారు.
- Advertisement -


