
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీది : ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ.
ఈ రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ రాజా రాజేశ్వరి నగర్ కాలనీలోని జీవీఆర్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హామీద్ పటేల్ ఆధ్వర్యంలో, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ విచ్చేసి, బీఆర్ఎస్ పార్టీ కోసం, తన గెలుపు కోసం అహర్నిశలు శ్రామిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ , కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ,
కేవలం కార్యకర్తల గుండె ధైర్యం మీద నడిచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకొన్నామని అన్నారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు, రైతు బంధు, దళిత బంధు, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, మిషన్ భగీరథతో ఇంటి ఇంటికి త్రాగు నీరు వంటి సంక్షేమ పధకాలు అందిస్తూ పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కార్యకర్తలకు అండగా ఉంటూ ఇకపై వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటామని హామీ ఇచ్చారు. మన బీఆర్ఎస్ పార్టీ గెలుపు కార్యకర్తల గెలుపని అన్నారు. ఈ కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్, గాంధీ , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ , బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, భీమని శ్రీనివాస్, గఫూర్, తిపర్తి రఘు, ఏరియా కమిటీ మెంబెర్స్ తిరుపతి యాదవ్, విజయ్, మంగమ్మ, ఇమామ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, అన్నం శశిధర్ రెడ్డి, అఖిల్ పటేల్, ఆదిల్ పటేల్, నిర్మల, రూప రెడ్డి, మీనా భి, చాంద్ పాషా, శ్రీనివాస్ చౌదరి, నరసింహ సాగర్, కరీం లాలా, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



