మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

- Advertisement -

మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

BRS party ranks offered milk to the statue of Telangana Mother in Manthani

మంథని
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు
పిలుపు మేరకు మంగళవారం మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంకు వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎగోలపు శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అపచారానికి తప్పకుండా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి సోమవారం తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటు చేసి ప్రారంభించాడన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ తల్లి విగ్రహమని ఆరోపించారు. ఎవరికైనా తల్లి ఒకటే ఉంటుందని అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, నాయకులు ఆకుల రాజబాబు, విజయ్ కుమార్, పోలు కనకరాజు, గొబ్బురి వంశీ ,మంథని లక్ష్మణ్ , వేముల లక్ష్మయ్య, బడికెల శ్రీనివాస్, బొడ్డు గణేష్, కొమురయ్య, ఎగొలపు  సమ్మయ్య, ఓదేలు, శ్రీనివాస్, కొండా రవీందర్, కడారి సంపత్ తో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular