కర్మన్ ఘాట్ లో బీఆర్ఎస్ పార్టీ బూతుస్థాయి కార్యకర్తల సమావేశం
ఎల్బీనగర్, వాయిస్ టుడే:బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పనిచేయాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని గురువారం కర్మన్ ఘాట్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో, ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, దేవిరెడ్డి రన్ ధీర్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, నల్ల రఘుమారెడ్డి, సుంకోజు కృష్ణమాచారి, రమావత్ పద్మనాయక్, రాజిరెడ్డి, అందోజు సత్యంచారి, కంచర్ల శివారెడ్డి, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.