.గ్రేటర్ ఎన్నికల్లో గెలవాల్సిందే
గ్రేటర్ హైదరాబాద్ పై గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్
హైదరాబాద్
brs Party special focus on Greater Hyderabad
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు తమ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ సైతం ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇక తాజాగా మూడు కార్పోరేషన్లుగా జీహెచ్ఎంసీని ప్రభుత్వం చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పోరేషన్లుగా విభజన చేశారు. దీంతో ముందుగానే బిఆర్ఎస్ పార్టీ అలెర్ట్ అయింది.మూడు కార్పోరేషన్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గ ఇంఛార్జిలు, ముఖ్య నేతలతో కేటీఆర్ తాజాగా సమావేశం అయ్యారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ముఖ్య నేతల భేటీలో ఎన్నికలపైనే
ప్రధానంగా చర్చ జరిగింది.మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల సమస్యలపై ఫైట్ చేయాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాజాగా కేటీఆర్ మూసీ నిర్వాసితులతో కలిసి పాదయాత్ర చేశారు. మూడు కార్పోరేషన్లలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సమస్యలు హైలెట్ చేయాలని కేటిఆర్ నేతలకు చెప్పారు. గ్రేటర్ మూడు కార్పోరేషన్లకు పార్టీ తరపున ఇంఛార్జిలను నియమించారు.జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, సైబరాబాద్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎన్నికల ఇంఛార్జ్ భాధ్యతలు అప్పగించారు.
2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగరంపై గులాబీ పార్టీ పట్టు సాధించింది.2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలో 150 డివిజన్లకు గాను 99 స్థానాలు బిఆర్ఎస్ గెలిచింది.2020 లో జరిగిన ఎన్నికల్లోను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గెలిచింది. 2018,2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గులాబీ మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన 2023లోను హైదరాబాద్,ఉమ్మడి
రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. రాబోయే మూడు కార్పోరేషన్ల ఎన్నికలకు కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి బిఆర్ఎస్ పార్టీకి దగ్గర అయ్యారు. దీంతో ఎమ్మెల్యేలు పార్టీ మారిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మెజారిటీ కార్పోరేటర్లు గెలిచే విధంగా గ్రౌండ్ లో ఉండాలని గులాబీ నేతలకు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.దీంతో లోక్ సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం గులాబీ పార్టీకి మైనస్ గా మారింది.



