కరీంనగర్ లో బీఆర్ఎస్ ప్లీనరి
కరీంనగర్, ఏప్రిల్ 8, (వాయిస్ టుడే )
BRS Plenary in Karimnagar
కేసీఆర్ మాటలనే అస్త్రాలుగా వాడతారు. పదునైన తన డైలాగులతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. తీరా చూస్తే ఆచరణలో అవి పెద్దగా ముందుకు సాగవని విమర్శలు ఉన్నాయి. దానికి ఉదాహారణలు కూడా
ఉన్నాయి. కేసీఆర్ గత ఏడాది పార్టీ ప్లీనరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కనుక చూస్తే తాను ఇక నుంచి జనంలో ఉంటాను అన్ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ రోజు నుంచి మీటింగుల మీద
మీటింగులే, జనంలో ఉంటూ కాంగ్రెస్ సర్కార్ ని నిలదీస్తామని అన్నారు. కానీ ఆ తరువాత కేరాఫ్ ఫాం హౌస్ గానే కధ సాగింది. మళ్ళీ గత ఏడాది డిసెంబర్ నెలలో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చరు. ఆయన
మాట్లాడుతూ ఇక మీదట జనంలో ఉంటాం, కొత్త ఏడాది అంటీఅ 2026లో వరసగా అనేక జిల్లాలలో మీటింగ్స్ పెడతాం, ఇక సమరమే అని గర్జించారు. కానీ అది కూడా జరగలేదు. చూస్తూండగానే ఏడాది
గడచిపోయింది. ఇక ఈసారి ప్లీనరీ ఎక్కడ అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో సాగుతోంది. అయితే ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో నిర్వహిస్తారు అని అంటున్నారు. దానికి కారణం ఉత్తర తెలంగాణాలో బీఆర్ఎస్ కారు జోరు తగ్గిది
అన్న భావన ఉండడమే. 2023 ఎన్నికల్లో కూడా బలమైన ఈ ప్రాంతంలో సరిగా వర్క్ చేసుకోకపోవడం వల్ల దక్కాల్సిన సీట్లు కూడా దక్కలేదు అన్న భావనతో బీఆర్ ఎస్ పెద్దలు ఉన్నారుట. ఉద్యమ కాలం నుంచి
కూడా తమకు అన్ని విధాలుగా కలిసి వచ్చి అచ్చి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ లోనే ప్లీనరీ పెడితే అది మంచి ఊపు ఇస్తుందని ఆ మీదట రానున్న కాలమంతా బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంటుందని లెక్కలేస్తున్నారు
అంతే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించే భారీ ప్లీనరీలోనే కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన సీనియర్ నేత మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డిని కండువా కప్పి చేర్చుకుంటారు అని అంటున్నారు. ఆ
విధంగా తమ బలం పెరిగింది అన్న సందేశాన్ని ఈ సభ సాక్షిగా ఇస్తారు అని అంటున్నారు. రాజకీయ అనుభవంలోనూ సీనియారిటీలోనూ కేసీఆర్ కి సమకాలీనుడు సరి జోడు అయిన జీవన్ రెడ్డి చేరికను కూడా ఒక
సంబరంగా నిర్వహించి క్యాడర్ కి సందేశం ఇవ్వాలని చూస్తున్నారుట. ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్లీనరీ తరువాత అయినా కేసీఆర్ జనంలోకి వస్తారా గట్టిగా మాట్లాడుతారా అన్న చర్చ సాగుతోంది. ఈ నెల 27న
బీఆర్ఎస్ ప్లీనరీ ఉంది. ఆ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలో పస లేదని సొంత కుమార్తె నాటి బీఆర్ ఎస్ మహిళా
నాయకురాలు అయిన కవిత సంధించిన లేఖాస్త్రాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బీజేపీని విమర్శించడంలో పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈసారి కేసీఆర్ ఏ అస్త్రాలను సిద్ధం చేసుకుని
సభకు వస్తున్నారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.



