- Advertisement -
వర్దన్నపేటలో బీఆర్ఎస్ నిరసన
వరంగల్
BRS protest in Vardannapet
కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వటం పట్ల ఆగ్రహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వర్ధన్నపేట మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పరిపాలన విధివిధానాలు తెలియని వాళ్ళు పాలకులుగా ఉండటం దురదృష్టకరం. పాలన చేతకాక, కేవలం రాజకీయ కక్షతోనే సిట్ పేరిట బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రేవంత్ దుర్మార్గపు పాలనకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలు అమలు చేయలేకనే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇలా డ్రామాలకి తెరలేపారని విమర్శించారు.
- Advertisement -



