- Advertisement -
అదిలాబాద్ లో బీఆర్ఎస్ నిరసనలు
BRS protests in Adilabadఅదిలాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిగా అభిమానిస్తూ సోనియా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం అమానుషమనీ మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు…
మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు . ప్రజలు ఎదుర్కొనే 6 గ్యారెంటీ ల మోసలతో పాటు, తెలంగాణ తల్లి పై సైతం కక్ష సాధించడం ప్రజలు గమనిస్తున్నారనీ జోగు రామన్న అన్నారు..
- Advertisement -




