Sunday, September 8, 2024

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

- Advertisement -

అదిలాబాద్, అక్టోబరు 28, (వాయిస్ టుడే): ఇప్పుడు ఆ రెండు పార్టీలు అప‌రేష‌న్ క‌మ‌లంపై వ‌ర్కవుట్ చేస్తున్నాయ‌ట. ఇన్ని రోజులు కేడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు, ఇప్పుడు మాత్రం మెజారిటీ, మైనారిటీ అంటూ వివిధ వ‌ర్గాల‌ను న‌మ్ముకున్నాయట. నిజామాబాద్ జిల్లాలో ఆ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు క‌మ‌లం బలంగా ఉండ‌టం, దానికి తోడు మైనారిటీ ఓట‌ర్లు అధిక సంఖ్యలో ఉండ‌టంతో రెండు పార్టీలు క‌లిపి క‌మ‌లాన్ని టార్గెట్‌గా చేస్తున్నాయ‌ట. మైనారిటీ ఓట్ల పోల‌రైజేష‌న్ కోసం రెండు పార్టీలు సిగ ప‌ట్లు ప‌ట్టుకుంటుంటే క‌మ‌లం పార్టీ మాత్రం మెజారటీ ఓట్లపై ఉన్న భ‌రోసాతో ముందుకు వెళుతుంద‌ట. నిజామ‌బాద్ జిల్లా బోధన్‌లో బీఆర్ఎస్, బీజేపీలు మైనారిటీ ఓట్ల కోసం సిగప‌ట్లు ప‌ట్టుకుంటున్నాయ‌ట. బోధన్‌లో ప్రతిసారి ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇక్కడి డిసైడింగ్ ప్యాక్టర్ ఎప్పటికీ మైనారిటీలే.. దీంతో అధికార బీఆర్ఎస్, ప్రతిప‌క్ష కాంగ్రెస్ పార్టీలు ఇక్కడి మైనారిటీ ఓట్ల కోసం చేమ‌టోడ్చుతున్నారట. దాదాపు 50 వేల మైనారిటీ ఓట్లు బోధన్ ప‌ట్టణంలోనే ఉండ‌టంతో.. ఇప్పుడు ఆ ఓట్లే గెలపోటముల్లో కీలకం. ఇందు కోసం రెండు పార్టీలు ప‌లు రకాల స్కెచ్‌లు వేస్తున్నార‌ట. కానీ బీజేపీ మాత్రం మెజారిటీ ఓట్ల పోల‌రైజేష‌న్ పైనే డిపెండ్ అయింది. దానికి అనుగుణంగా వ్యూహ‌లు ర‌చిస్తుంద‌ట క‌మ‌ల ద‌ళం.బోధన్ నియోజకవర్గం కొత్తగా నమోదైన మైనారిటీ ఓట‌ర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి ప్రాంతాలకు చెందిన మైనారిటీ వర్గాల వారిని బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లను తొలగించాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఏకంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మెడ‌పాటి ప్రకాశ్ రెడ్డి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దాదాపు 8 వేలా ఓట్లను తొల‌గించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు వేసిన స్కెచ్‌తో బీజేపీ మెజారిటీగా హిందూ ఓటు బ్యాంక్ పోల‌రైజెష‌న్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 వేల ఓట్లు పోవ‌డంతో డైలామాలో ప‌డింద‌ట బీఆర్ఎస్. ఇక హిందూ ఓటు బ్యాంక్‌ను చేసుకునే పనిలో పడ్డాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఈనేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీతో ఇప్పటి వ‌ర‌కు ఉన్న వాళ్లను టార్గెట్ చేసి తమ పార్టీల్లోకి ఆక‌ర్షిస్తున్నార‌ట. బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్‌గా పైట్ మార‌డంతో ఏవ‌రి బ‌లం వాళ్లు చూపించుకోవాడానికి ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట.బీజేపీ నియోజక‌వ‌ర్గ ఇంచార్జ్‌గా ప్రకాశ్ రెడ్డి టికెట్ వ‌స్తే ఇబ్బంది అవుతుంద‌నే ఆలోచ‌న‌తో మ‌రో వ్యక్తికి టికెట్ వ‌స్తుంద‌నే మైండ్ గేమ్ అడుతున్నాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, బీజేపీ మ‌ద్యే ఉండ‌టంతో.. కాంగ్రెస్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఆరోపిస్తున్నార‌ు బీజేపీ నేతలు.ఇక ఇన్ని రోజులు క్యాడ‌ర్‌ను న‌మ్ముకున్న పార్టీలు ఇప్పుడు వ‌ర్గాల‌ను న‌మ్ముకోవ‌డం ఎల‌క్షన్ హీట్ క‌నిపించేలా చేస్తుంద‌ట. ఇప్పటికే ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోవ‌డంతో బీజేపీ అభ్యర్థి ఫైన‌ల్ అయితే పోటి ఇంకా ర‌స‌వ‌త్తరంగా ఉండ‌నుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ‌ర్గాలు, కులాలు అంటూ బోధన్ పాలిటిక్స్ ఇంకా ఎన్ని మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్