Sunday, September 8, 2024

తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది

- Advertisement -
  • బీఆర్ఎస్ నేతల మాటలు ప్రజలు నమ్మరు
  • కాంగ్రెస్‌ను విమర్శిస్తే కబడ్ధార్
  • టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్.

వాయిస్ టుడే న్యూస్ పటాన్ చెరు: తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికల సమయంలో ఉచిత కరెంట్ ఇస్తాం, రైతులకు రుణ మాఫీ చేస్తాం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులను సరైన న్యాయం జరిగిందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేసి కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చాటుకుందన్నారు. బీఆర్ఎస్ మంత్రులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి మంత్రి కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని, మరో మూడు నెలల్లో ప్రజలే వారికి బుద్ది చెబుతున్నాని  గాలి అనిల్‌కుమార్  అన్నారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటను సరైన సమయంలో కొనుగోలు చేయకుండా, కొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్నదాతలను మోసం చేసిందన్నారు. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని మాయ మాటలు చెప్పి రైతులతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని, కుట్రలతో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ప్రజలు మీ మాట నమ్మో పరిస్థితుల్లో లేరని అనిల్‌కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్