- Advertisement -
పార్టీ ఫిరాయింపులు అడ్డుకునేందుకు బీఆర్ఎస్ రెండంచెల వ్యూహం.!
ఒక్కరితో మొదలైన ఫిరాయింపులు ఐదుకు చేరాయి. ఈ విషయంలో కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమించడంతో పాటు క్యాడర్ చేజారకుండా కసరత్తు చేస్తోంది. పార్టీలో కమిటీలు వేయాలని నిర్ణయించింది. మరోవైపు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతోంది.
- Advertisement -