బడ్జెట్ నిరాశాజనకంగా వుంది
కేటీఆర్
సికింద్రాబాద్
సికింద్రాబాద్ లో జరిగిన సనత్ నగర్ తలసాని విజయోత్సవ సభలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. మేడి పండు లాంటి బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 53 వేల కోట్లతో అరు గ్యరెంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతున్నారు..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలి. అరు గ్యరెంటీలకు 1 లక్ష 25 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయి..బడ్జెట్ లో కేటాయించింది ఎంత అని అన్నారు.
బీఆర్ఎస్ ను బొంద పెట్టడం కాదు.. లంకె బిందల కోసం తిరిగే వ్యక్తి సి ఎం రేవంత్ రెడ్డి కాబట్టి లంకె బిందల కోసం మాట్లాడుతున్నాడు. రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ను 39 ముక్కలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడ్డం సరికాదు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ ను కోల్పోయామని బాదలో ప్రజలు ఉన్నారు. టి ఎస్ తీసి టి జి పెట్టడం,చార్మినార్,కాకతీయ తోరణం తొలగింపు మార్పుకు శ్రీకారం చుట్టినట్లా. సి ఎం పదవి గుంపు మేస్త్రి అని చెప్పినట్లే ఆయన పనితీరు ఉంది. ప్రజా ఉద్యమాన్ని నిర్మించి కొనసాగిద్దాం. కె అర్ ఎం బి కింద ప్రాజెక్టులను అప్పజెప్పింది కాంగ్రెస్ సర్కార్. ఈ నెల 13 న రాష్ట్ర ప్రభుత్వ కేంద్రానికి కే అర్ ఎం బి నీ ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ సభ ను విజయవంతం చేయాలి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ప్రాజెక్టులను,హక్కులను కాపాడితే ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి అప్పగించి తెలంగాణ ప్రజల ను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.
బడ్జెట్ నిరాశాజనకంగా వుంది -కేటీఆర్
- Advertisement -
- Advertisement -



