
జూబ్లీహిల్స్ ఫిబ్రవరి 10 (వాయిస్ టుడే)
యూసుఫ్ గూడా డివిజన్ శ్రీ కృష్ణ నగర్ పరిధిలో దాదాపుగా 30 ఎల్ల కిందట మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేశారు..మున్నూరు కాపు సంఘం సభ్యులు, ఈ క్రమం లో ఈ నెల 10 వ తారీకు (ఫిబ్రవరి 2025) మున్నూరు కాపు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి మున్నూరు కాపు బిల్డింగ్ ప్రాంగణం లో . ఈ అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు పోటీ పడిన అభ్యర్థుల లో తుమూల రవి కుమార్ ( సూర్యుని గుర్తు),బుడుగు రవీందర్( త్రాసు గుర్తు) పోటీపడ్డారు ఈ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి తదుపరి 3 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలు ఆయ్యింది మున్నూరుకాపు సంఘం ఎలెక్షన్ కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 343 ఓట్లు పోలు అయ్యాయి వాటిలో తూముల రవి( 81 ఓట్లు) మీద బుడుగు రవీందర్ (259) 178 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం విజేత గా నిలిచిన బుడుగు రవీందర్ ను శాలువాతో ఘనం సన్మానించి అభినందనలు తెలిపారు మున్నూరు కాపు సంఘం సభ్యులు . అనంతరం మున్నూరు కాపు సంఘం సభ్యులు సభ్యులు ఓపెన్ టాప్ జీపులో బ్యాండ్ తో కృష్ణ నగర్ పుర వీధుల గుండా ఊరేగించారు ఈ సందర్భం గా బుడుగు రవీందర్ మాట్లడుతూ నాపై నమ్మకము ఉంచి నన్ను గెలిపించిన మున్నారు కాపు సంఘం సభ్యులు కు ప్రత్యెక కృత జ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు అధ్యక్ష పదవి తో పాటు ఏకగ్రీవంగా గా మున్నూరు కాపు సంఘం పదవవులకు ఎన్నికయ్యారు ఏక గ్రీవం గా ఎన్నికయిన వారిలో వి తిరుపతి( వైస్ ప్రెసిడెంట్), పీ.అశోక్( వైస్ ప్రెసిడెంట్), ఏ,సత్తయ్య(( జెనరల్ సెక్రటరీ), బి.సురేష్( కోశాధికారి) ఎన్నికయ్యారుశ్రీ కృష్ణ నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడుగా 178 ఓట్లతో బుడుగు రవీందర్ గెలుపు