గుండెపోటుతో బుగ్గారం ఎంపీడీఓ మృతి
Bugaram MPDO died due to heart attackఎంపీడీఓ మృతికి పలువురి సంతాపం
జగిత్యాల,
: జిల్లాలోని బుగ్గారం ఎంపీడీఓ గా విధులు నిర్వర్తిస్తున్న మాడిశెట్టి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని పలువురు నాయకులు, ఉద్యోగులు పేర్కొన్నారు. శనివారం రాత్రి కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఎంపీడీఓ శ్రీనివాస్ కు గుండె పోటురావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని అయినా ఆయనను కాపాడుకోలేక పోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ తెలిపారు.
ఫిబ్రవరిలో జరిగిన బదిలీల్లో శ్రీనివాస్ బుగ్గారం ఎంపిడిఓగా బదిలీపై వచ్చి అంకితభావంతో విధులు నిర్వర్తించారని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందితో పాటు ఎంపిఓ అఫ్జల్ మియా, పంచాయితీ కార్యదర్శులు, కారొబార్లు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ పార్టీల నాయకులు శ్రీనివాస్ సేవలను కొనియాడారు.
విధి నిర్వహణలో జగిత్యాల జిల్లాలోని తోటి అధికారులతో, తన సిబ్బందితో గడిపి ఆయన అకాల మరణం చెందడంతో ఉద్యోగులు, నాయకులు, ప్రజలు, దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఎంపీడీఓ శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్,బుగ్గారం మాజీ జెడ్పిటిసి బాధినేని రాజేందర్ లు, బుగ్గారం ఎంపిఓ అఫ్జల్ మియా, పంచాయితీ కార్యదర్శులు,ఇతర ఉద్యోగులు ఆదివారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించి,
కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఎంపీడీఓ శ్రీనివాస్ మృతి పట్ల
జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, చందయ్యపల్లె మాజీ సర్పంచ్ ఎన్నం కిషన్ రెడ్డి,జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్,జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, మండల కాంగ్రెస్ నాయకులు నగునూరి నర్సా గౌడ్, జంగ శ్రీనివాస్, రాజశేఖర్, సమీద్,
పంచాయితీ కార్యదర్శులు, కారొబార్లు, కార్యాలయ సిబ్బంది, నాయకులు గట్టు గంగారాం,డాక్టర్. నక్క రాజు, నక్క జితేందర్, శ్రీనివాస్, రాజేందర్ రావు, అశోక్ రావు, తదితరులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.




