తాళాలు వేసిన ఇంట్లో చోరీ.
గద్వాల ఫిబ్రవరి19 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీ లో నివసిస్తున్న ఉప్పరి శ్రీనివాస్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో మూడు తులాల బంగారు నగలు, రూ.4.50 లక్షల నగదు మాయం అయినట్లు బాధితులు సోమవారం గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పరి శ్రీనివాసులు మిర్చి వ్యాపారి కావడంతో ఆదివారం ఇంటికి తాళాలు వేసి మిర్చి విక్రయించడానికి గుంటూరుకు వెళ్లాడు. సోమవారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలకొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దీంతో బీరువాలో పెట్టిన రూ.4.50లక్షల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు….




