Sunday, September 8, 2024

రగిలిపోతున్న కామ్రేడ్స్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 18, (వాయిస్ టుడే):  తెలంగాణలో  ఒకప్పుడు వెలుగొందిన కామ్రెడ్లు .. ప్రస్తుతం సొంతగా ఒక్క సీటు కూడా గెలవలేని స్థితికి వచ్చారు … అలాగని వారిని తీసి పారేయలేం… ఇప్పటికీ పలు సెగ్మెంట్లలో వారు నిర్ణయాత్మక శక్తే అంటే అతిశయోక్తి కాదు… మునుగోడు బైపోల్స్ లో బీఆర్ఎస్ విజయం వెనుక కమ్మునిస్టుల పాత్రను ఎవరూ కొట్టిపారేయలేరు… అలా మునుగోడులో గులాబీ పార్టీ వెంట నడిచిన ఎర్ర సోదరులు ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్తేనే రగిలిపోతున్నారంట… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలన్న కసితో ఉన్నారంట… అందుకు వారు ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది…. అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది?

తెలంగాణలో చివరగా జరిగిన మునుగోడు బైపోల్స్ లో గెలుపొందిన బీఆర్ఎస్ పరువు కాపాడుకుంది… మునుగోడు గెలుపు కోసం నానా పాట్లు పడిన బీఆర్ఎస్.. వామపక్షాలతో  సైతం సంప్రదింపులు జరిపి వారి మద్దతు కూడగట్టుకుంది … ఆ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న కామ్రెడ్లు గులాబీ పార్గీకి ప్లస్ అయ్యారు …. మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో వెళ్లవద్దని.. కాంగ్రెస్ తో కలవాలని కమ్యూనిస్టు పార్టీ నేతల్ని… కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే బీజేపీని ఓడించే పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీతో కలుస్తామని… కాంగ్రెస్ ను దూరం పెట్టారు కమ్యూనిస్టులు.

Burning comrades
Burning comrades

నెలలు తిరగకుండానే సన్ మారిపోయింది… ఏ విషయంలో సంప్రదించకుండా, అసలు తమను పట్టించుకోనట్లే వ్యవహరిస్తూ… కేసీఆర్ తమను ఘోరంగా అవమానిస్తున్నారని కామ్రెడ్లు భావిస్తున్నారంట… వాస్తవానికి జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయంటున్నారు … బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో పొత్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదు… అసలు కమ్యునిస్టులను పరిగణలోకే తీసుకోలేదు … దీంతో ఇప్పుడు తాము చేసిన తప్పేమిటో వారికి తెలిసి వచ్చిందంట.

ఆ క్రమంలో కామ్రెడ్లు తాము జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో పని చేస్తున్నామని… తెలంగాణలో కూడా కలిసి పని చేస్తామన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు … కేసీఆర్ చేసిన మోసంతో తెలంగాణలో రగిలిపోతున్న వామపక్షాలు … కేసీఆర్ ఘోరంగా అవమానించారని .. వాడుకుని వదిలేశారని.. అమాయకంగా మోసపోయామని తెగ ఫీలై పోతున్నారంట…. అందుకే బీఆర్ఎస్‌కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు .. ఆ క్రమంలో హైదరాబాద్‌లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి.

ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ, సీపీఎంలు చర్చించాయంట… బీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారంట… ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలపై చర్చించి…  త్వరలోనే నిర్ణయం ప్రకటించబోతున్నారంట… వచ్చే ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉంటుందని దక్షిణ తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలు కీలకమవుతాయని భావిస్తున్నారు…. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…. ఆయా జిల్లాల్లో కమ్యునిస్టులకు చెప్పుకోదగ్గ కేడర్ ఉంది …

ఇక ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సొంతగా ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయింది… వలస ఎమ్మెల్యేలతోనే బలం పెంచుకుంటూ వచ్చింది …. దక్షిణ తెలంగాణలో తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి…. ఈ సారి ఆ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయన్న అభిప్రాయం ఉంది … ఆ క్రమంలో బీఆర్ఎస్ ను ఓడిస్తామని…. తామేంటో చూపిస్తామని.. అందుకు కాంగ్రెస్ తో కలుస్తామని వామపక్ష నేతలంటున్నారంట… మరి చూడాలి కామ్రెడ్ల పాలిటిక్స్ కారు స్పీడుకి ఎంత వరకు బ్రేకులు వేస్తాయో? ..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్