- Advertisement -
మామాజి జిలేబీ సెంటర్ వద్ద జిలేబీ తిన్న సంజయ్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం కరీంనగర్ టవర్ సర్కిల్ కు వెళ్ళారు. అక్కడ ఉన్న మామాజీ జిలేబి సెంటర్ వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి జిలేబీ తిన్నారు. సామాన్య ప్రజలలాగా బండి సంజయ్ అక్కడికి రావడంతో పలువురు షాప్ యజమానులు, ప్రజలు తనను కలవడానికి వచ్చారు. ఈ సందర్బంగా వారి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్నటి వరకు బిజీ బిజీగా గడిపిన సంజయ్ కుమార్, నేడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో ఇలా సేద తీరారు.
- Advertisement -