Sunday, February 9, 2025

బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు

- Advertisement -

బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు

Businesses that do not appear at the border

హైదరాబాద్, డిసెంబర్ 30, (వాయిస్ టుడే)
మద్యం అంటే మగవాళ్లు చిందులేస్తారు.. ఉత్సాహంగా సేవించడానికి ముందుకు వస్తారు.. దీంతో మందు బాబులతో మద్యం షాపులు ఎప్పటికీ కిటకిటలాడతాయి. ఇక దసరా సంక్రాంతి తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. మిగతా వాటి కంటే మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నందున ప్రభుత్వం సైతం ఆబ్కారీ శాఖ ద్వారా మద్యం షాపులను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. కొన్ని ఏరియాల్లో లాభాలు రావడంతో అక్కడ మద్యం షాపులను ఒకటికి మించి ఏర్పాటు చేస్తోంది. అయితే ఒకప్పుడు మద్యం దొరకాలంటే గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన షాపులు.. ఇప్పుడు మందుబాబుల కోసం ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఈ షాపులకు రూ.40 కోట్ల ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మద్యం షాపులు ఎక్కడివో తెలుసాతెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. అందులోనూ తెలంగాణలో మొన్నటి వరకు మద్యం ధరలు తక్కువగా ఉండటంతో ఏపీ నుంచి చాలామంది తెలంగాణ బార్డర్లో ఉన్న షాపుల్లో కొనుగోలు చేసేవారు. హైదరాబాదులోని మద్యం షాపుల తర్వాత తెలంగాణ బార్డర్లో ఉన్న షాపులకే ఎక్కువగా రద్దీ ఉండేది. అయితే ఇప్పుడు ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువ ధరకే మద్యం విక్రయించడంతో ఏపీ నుంచి కొనుగోలు చేసేవారి సంఖ్య తెలంగాణ బార్డర్లో లో ఉన్న షాపులకు తగ్గింది. తెలంగాణ బార్డర్ లో ఉన్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మండలాల్లో ఉన్న షాపులకు ఏపీ నుంచి చాలామంది వచ్చి మద్యం కొనుగోలు చేసేవారు. అయితే ఈ షాపులకు రద్దీ విపరీతంగా పెరగడంతో రేషన్ కార్డు ఆధారంగా మద్యం విక్రయించేవారు ఆదివారం తో పాటు సెలవు దినాల్లో పోలీస్ పహార మధ్య మద్యం విక్రయించేవారు.కానీ ఇప్పుడు ఈ మద్యం షాపులకు ఏపీ నుంచి కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా తగ్గింది. ఒకప్పుడు తీరిక లేకుండా ఉన్న మద్యం షాపు లోని సిబ్బంది ఇప్పుడు ఖాళీగా కూర్చుంటున్నారు. అంతేకాకుండా డిసెంబర్ నెలలో ఈ షాపులకు రూ. 40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. సాధారణంగా దసరా, సంక్రాంతి, న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం షాపులకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఆయా జిల్లాలోని షాపుల నుంచి దాదాపు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ దసరా పండుగకు భారీగా ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది .ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో మని ఆబ్కారీ శాఖ ఆలోచిస్తుంది. ఏపీలో ఎన్డీఏ సత్తార్ వచ్చిన తర్వాత మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచడంతోపాటు చాలావరకు ధరలు తగ్గించారు. దీంతో ఈ షాపులకు ఆదాయం తగ్గింది. అయితే ముందు ముందు కూడా ఇక్కడ ఆదాయం తగ్గితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒకవేళ ఈ షాపులకు ఆదాయం తగ్గితే వీటిని కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్