Tuesday, January 21, 2025

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి…..

- Advertisement -

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి…..

By Sankranthi the construction of Indiramma's house model house will be completed.

రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రాష్ట్రంలో 580 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలు యాప్ లో నమోదు
ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మo
రాబోయే సంక్రాంతి నాటికి కూసుమంచి మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 5 లక్షల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన నేపథ్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్, రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నామని, ఇందులో భాగంగా రాబోయే నాలుగు సంవత్సరాలలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నెరవేర్చేందుకు డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడగానే చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో అర్హులైన దరఖాస్తులను ఎంపిక చేసి మొదటీ విడత ప్రభుత్వం మంజూరు చేసే నాలుగున్నర లక్షల ఇండ్ల క్రింద ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పేదలు ప్రస్తుతం నివసించే గుడిసె, షెడ్డు, టార్ఫాలిన్ కవర్ ఇళ్లు ఫోటో తీసుకొని వివరాలు నమోదు చేయడం జరుగుతుందని, యాప్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం బహు పేదలను ఎంపిక చేసి మొదటి విడత లబ్ది చేకూరుస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల క్రింద సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడతలలో అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిల స్థాయికి చేరగానే లక్షా పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయల సహాయం అందుతుందని, ప్రతి దశలో ఇంటి నిర్మాణ పురోగతి వివరాలు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం నమూనాల నిర్మాణం కోసం మొదట డోర్నకల్ నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో శంకుస్థాపన చేయడం జరిగిందని, నేడు కూసుమంచి మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మరో నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన  చేశామని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 580 ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. సంక్రాంతి నాటికి కూసుమంచి మండల కేంద్రంలోని మోడల్ హౌస్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
మోడల్ హౌస్ ను పరిశీలించి తక్కువ ధరతో నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి వారి స్థలాలలో నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వివరాలు సేకరణ జరిగిందని,  డిసెంబర్ చివరి వరకు ప్రతి దరఖాస్తుదారుని వివరాలు సేకరణ పూర్తవుతుందని అన్నారు.
గతంలో దరఖాస్తు చేసుకొనని కుటుంబాలు ఉంటే ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు సమర్పించవచ్చని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు సమర్పించాలని మంత్రి తెలిపారు. వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజా ప్రభుత్వానికి లేదని, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు తగ్గకుండా నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ఎటువంటి ఇబ్బంది రాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పేదవాడి చిరకాల కోరిక సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్