బై బై గణేష్ మహారాజ్

- Advertisement -

బై బై గణేష్ మహారాజ్

Bye bye Ganesh Maharaj

 శ్రీకాళహస్తి సెప్టెంబర్ 9

గణనాథుడి పండుగతో ఊరువాడ సందడిగా మారింది. మండపాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. శ్రీకాళహస్తి పట్టణం లో 500 విధుల్లో విగ్రహాలు ఆయా కాలనీలో కొలువుదీరాయి. శని ఆదివారాల్లో వీధులలో వివిధ రూపాలలో నెలకొల్పిన గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రామచంద్ర కూల్ డ్రింక్ షాపు ఆవరణంలో ,ధర్మ పరిరక్షణ గణపతి,ఓటేరు కాల్వ వద్ద వరహ గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిదంగా పలు విగ్రహాల దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా ఈ ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం వీధి వీధిన వెలసిన గణనాధులను శోభాయమానంగా యాత్ర మొదలుపెట్టారు. ఇందులో యువత చాలా గొప్పగా పాల్గొని బాణ సంచాల తోటి గ్రామ ప్రజలకు సంతోషాన్ని కలిగించారు. ఎంతో ఉత్సాహంగా వయస్సులతో తేడా లేకుండా ప్రేమతో ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహాన్ని కనపరిచారు. సమీప కాలువలో నిమజ్జనం చేయాలని పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular