ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కు ఫిర్యాదు చేసే మొబైల్ యాప్ సి-విజిల్
ఫోటో, వీడియో అప్లోడ్ చేసే సమయంలో ఫోన్లో జిపిఆర్ఎస్ ఆన్ చేసి ఉండాలి, ఫిర్యాదు చేసే వ్యక్తి తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు గ్రూప్ లో ఉంటాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినప్పుడు ఫోటో కానీ రెండు నిమిషాల నిడివి తో ఉన్న వీడియోలు కానీ యాప్ లో అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా పంపిణీ వివరాలు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి చేరుతాయి. అక్కడ క్షేత్రస్థాయిలో 24 గంటల పాటు పనిచేసే అందుబాటులో ఉండే సిబ్బంది అధికారులకు సిబ్బందికి యాప్ లో వచ్చిన ఫిర్యాదులను సంబంధించిన బృందాలకు పంపించి వంద నిమిషాల్లో పరిష్కరించి మీకు కేటాయించిన ఐ డి కి తిరిగి పంపిస్తారు.
ఉల్లంఘన అంశాలు:
* ఓట్ల కోసం అభ్యర్థులు వారి అనుచరులు భౌతికంగా, మానసికంగా భయాందోళనకు గురిచేయడం.
* బహిరంగ సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలతో ఓటర్లను రెచ్చగొట్టడం.
* ఓటర్లను పప్రలోభాలకు పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ.
* ప్రచార గడువు ముగిసిన తర్వాత సైతం స్పీకర్లు, ప్రలోభాల్లో భాగంగా వస్తువులు, సామాగ్రి పంపిణీ.
* ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో బాధ్యత రహితంగా పని చేయడం.
* ఎన్నికల ప్రచార నిబంధనలు ఉల్లంఘన.
పై అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైనా ఒక అంశంపై ఉల్లంఘన జరిగిన ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగేందుకు దోహదపడిన వారు అవుతారు.