Thursday, September 19, 2024

కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెంపదెబ్బ

- Advertisement -

కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెంపదెబ్బ
బంగారు బాతు లాగా తెలంగాణ కు బంగారు గుడ్ల ను ఇస్తున్నకేంద్రం
తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ డిమాండ్
హైదరాబాద్ ఆగష్టు 5

CAG Report is a slap in the face to Congress and BRS

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన CAG రిపోర్ట్ లో కేంద్రం ఒక్క హెల్త్ సెక్టార్ లో 2016 – 2022 ఆర్థిక సంవత్సరాలకు తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు కేంద్రం బంగారు బాతు గుడ్లను ఇస్తుందనడనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ అన్నారు. పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి, మంత్రులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారు .ద్రం నుండి నిధులు వచ్చినా రాలేదని అబద్ధాలు చెప్పారు. కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెంపదెబ్బ లాంటిది. ప్రభుత్వం ను ఎడమచేయితో చెంపదెబ్బ కొట్టినట్టుంది రిపోర్ట్ వైద్య ఆరోగ్య శాఖ కు కేంద్రం నుంచి వచ్చిన నిదులు , తిరిగి వెళ్ళి పోయిన నిధులు ఈ రిపోర్ట్ లో చెప్పారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బంగారు బాతు గుడ్డు లాంటిదన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి లు గాడిద గుడ్డు స్తోత్రం పాటిస్తున్నారని ఆమె విమర్శించారు.42 శాతం డెవల్యుషన్ ఫండే కాకుండా అనేక మార్గంలో డబ్బు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్రం ను బద్నాం చేసేందుకు అప్పటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతం లో కేసీఆర్ ప్రధాని మోదీ వచ్చినప్పుడు అనేక కారణాలతో కలువకుండా తప్పించుకున్నాడుఇప్పుడు మోదీ ని బడేబాయ్ అంటూ చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మోదీ ని తిడుతున్నారు .ఒకరు కలవకుండా నిందించి మరొకరు కలిసి నిందించి , నిందించడమే ప్రధాన ఉద్దేశం గా పెట్టుకున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలనే ఉద్దేశం లేదన్నారు.కేంద్రం పై కొట్లాట పెట్టుకోవడం కోసం రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన బిఆర్ఎస్ ను కలిసి పోరాటం చేద్దాం అని పిలుపు నిచ్చిన కాంగ్రెస్ , తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే వారికి ఒక నివేదిక ఇచ్చి తెలంగాణ కు ఇవి కావాలి అని ఎందుకు అడగరు…?అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమని దీన్ని బట్టి అర్తమైతుంది.నేషనల్ హెల్త్ మిషన్ 2017 నియమాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ కు 8 శాతం బడ్జెట్ కేటాయించాలి, కాని 3.9 శాతయే కెటాయించారు. గత ప్రభుత్వం 5 శాతం కేటాయించి ఆ మొత్తం కూడా ఖర్చు చేయలేదు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా 2016 నుంచి 2022 వరకు కేంద్రం తెలంగాణ కు కేటాయించిన నిధులు2016-17 లో 1201 కోట్లు,2017-18 లో 1660,2018-19 లో 1466 ,2019-20 లో 2030,2020-21 లో 2310,2012-22 లో 939కోట్లు అని తెలిపారు.నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్రం వాట 60% ప్రకారం 2016 నుంచి 2022వరకు విడుదల చేసిన నిధులు856, 570,520,649,1765,1246 కోట్ల రూపాయలు .కేంద్ర ప్రభుత్వం టీవీవిపి లకు 3.20కోట్లు విడుదల చేసింది దానిని డ్రా చేసుకుని ఏ పని చేయలేదు ఐటీడీఏ కింద 25కోట్ల రూపాయలు వస్తే 12.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది NPCDCS అమలు కోసం కేంద్రం 32.59 కోట్లు ఇస్తే రాష్ట్రం తన వాటా విడుదల చేయలేదన్నారు.అయూష్ మిషన్ కింద ఆరేళ్ల లో కేంద్ర ప్రభుత్వం 68 కోట్ల రూపాయలు ఇచ్చింది, టీబీ నియంత్రణ కోసం 176 కోట్ల రూపాయలు కర్చు పెట్టింది కుష్టు రోగ నివారణ కోసం 24 కోట్లు కెటాయింపుమలేరియాను పారద్రోలేందుకు కోట్ల రూపాయలు కేటాయించింది పీఎం మాతృ వందన యోజన కింద మాతృ మూర్తులకు ఇచ్చే డబ్బు లతో కేసీఆర్ కిట్ కంటే ఎక్కువ పేరొస్తుంది అని వాటిని వాడుకోలేదు ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు ఇస్తే దారి మల్లిస్తారుదారి మళ్లించలేని నిధులను తీసుకుని తీసుకోలేదు అని అబద్దాలు చెబుతారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు కాదు బంగారు బాతు గుడ్డు ఇస్తుందన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ధూషించుకుని అప్రాప్రియేషన్ బిల్లు పై కూడా చర్చ లేకుండా ముగించారు తెలంగాణ వచ్చాక నిర్వీర్యం అయిన రంగాలు విద్యా, వైధ్య శాఖలేరాష్ట్ర బడ్జెట్ లో 8 శాతం నిధులు కేటాయించాలి. నిర్దిష్టమైన ఆరోగ్య ప్రణాళిక ప్రకటించాలి.వైద్య శాఖలో సిబ్బంది నియామకాలు చేపట్టలేదు అనేక ఆసుపత్రులలో సిబ్బంది లేరు ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయడం లేదు, ఎక్విప్మెంట్ కూడా లేదు బస్తీ దవాకనల్లో సైతం బీపీ , షుగర్ ట్యాబ్లెట్ లు కూడా అందుబాటులో లేవు సీ సెక్షన్ ఆపరేషన్ లు లు 60 శాతం ఉన్నాయని కాగ్ రిపోర్ట్ చెబుతోంది నార్మల్ డెలివరీ లు పెంచేందుకు ఏం చేస్తున్నారు రాష్ట్రం నడవాలంటే కయ్యం పెట్టుకోవడం కాదు మనకు ఇవి కావాలని ఒక రిపోర్టు ను రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు ఎందుకు ఇవ్వరు కేసీఆర్ బాటలో నడవాలి, కేంద్ర ప్రభుత్వం ను బద్నాం చేయాలి అని చూస్తున్నారు వచ్చిన నిధులను తీసుకుంటాం కయ్యం పెట్టుకుంటాం అంటే ప్రజలు తెలివి లేని వారు కాదు తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలిగ్రామీణ ప్రాంతాల్లో కూడా  జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అని ప్రజలందరికీ తెలుసునన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్