రాజన్న హుండి లెక్కింపు

- Advertisement -

దాదాపు రెండు కోట్ల ఆదాయం

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో  హుండీ లెక్కింపు జరిగింది. నగదు రుపెనా ఒక కోటి 99 లక్షల 34 వేల 997 రూపాయలు, బంగారం 203 గ్రాములు, వెండి 10 కిలోల 100 గ్రాములు ఆదాయం సమకూరిన్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్నను ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఆర్జిత సేవల ఆదాయం కాకుండా కేవలం హుండీ ద్వారానే దాదాపు రెండు కోట్ల ఆదాయం సముకూరిన్నట్లు ఈవో చెప్పారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సేవ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఎస్పిఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా హుండీ కౌంటింగ్ పర్యవేక్షించారు.

Calculation of Rajanna Hundi
Calculation of Rajanna Hundi
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular