రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు!
Call for Telangana bandh tomorrow!
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు బ్రేక్‌తో ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ
హైదరాబాద్, అక్టోబర్ 9:(సిరాచుక్క) తెలంగాణలో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు ఇచ్చింది. బీసీ వర్గాలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్లు నిలిపివేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం పార్టీ తీవ్రంగా ఖండించింది.
“రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసింది..! బలహీనమైన జీవోతో న్యాయం చేసినట్లు నటించి, బీసీల హక్కులను తాకట్టు పెట్టింది” అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ దహనాలు, నిరసన ర్యాలీలు, రోడ్డుమీద ఆందోళనలు నిర్వహించనున్నారు.
మల్లన్న వ్యాఖ్యలు
ఇది కేవలం బంద్ కాదు – ఇది బీసీ హక్కుల కోసం బలమైన ఆవాజ్.
ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి రిజర్వేషన్లు పునరుద్ధరించాలి. బీసీలతో చేసిన మోసానికి సమాధానం చెప్పాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్
బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ తక్షణమే ఎన్నికల తక్షణ నిర్వహణ చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర మొదటి సారి బంద్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. జిల్లా కేంద్రాల్లో సైతం బంద్ సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాపిత బంద్ కు టీపీసీసీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ డి.. వై. గిరి మద్దతు పలికారు. జిల్లాలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు బీసీలకు మద్దతుగా నిలిసే సమయం ఇదేనాని ఆయన చెప్పారు. ప్రజలు సైతం ప్రశాంతంగా బంద్ పాటించాలని మహబూబాబాద్ జిల్లా వ్యాపార, వాణిజ్య, విద్య సంస్థలు స్వచ్చందంగా మద్దతుగా నిలువాలని డి. వై. గిరి కోరారు.


